Saturday, September 11, 2010

ఎందరో మహానుభావులు

http://www.youtube.com/watch?v=iWFqdYBtILI&fea

కొన్ని రోజులుగా ఈ పాటని పదే పదే విన్నాను. తెలుగులో పాట చరణాల కోసం నెట్ లో వెతికి దొరకకపోయే సరికి ఇలా రాద్దామనిపించింది .

చిత్రం: త్యాగయ్య
గానం: నాగయ్య
సంగీతం: నాగయ్య


ఎందరో మహానుభావులు అందరికి వందనములు
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
ఎందరో మహానుభావులు ..


చందురు వదనుని అంద చందమును
హృదయారవిందమున జూచి
బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు..


సామ గాన లోల మనసిజ లావంయ
ధన్య మూర్ధన్యు లెందరో మహానుభావులు..


మానస వనచర వర సంచారము సలిపి
మూర్తి బాగుగ పొడగనే వారెందరో మహానుభావులు..
సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయువా రెందరో మహానుభావులు..


హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచు పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై
ముదంబునను యశంము గలవా రెందరో మహానుభావులు..


భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములను శివాది షణ్మతముల
గూఢములను ముప్పది ముక్కోటి
సురాంతరంగముల భావంబుల
నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు.. అందరికి వందనములు..

ఎందరో మహానుభావులు .

1 comment:

Shree said...

This is a very popular kriti by Tyagaraja, and is deemed one among the pancharatnas. Lyrics/notation can be found at quite a few places on the www, one being this : http://www.shivkumar.org/music/endaromahanubhavulu-new.htm

I've posted the full text in telugu unicode here :
http://sunaada.blogspot.com/2011/08/blog-post_4544.html